Home  »  TV News  »  Brahmamudi: డీఎన్ఏ టెస్ట్ భయంతో వణికిపోతున్న రేఖ.. రేపటి ఎపిసోడ్ లో అసలు నిజం బయటపడుతుందా?

Updated : Aug 24, 2026

స్టార్ మా టీవీలో ప్రసారమవుతున్న సీరియల్ బ్రహ్మముడి. ఈ సీరియల్ కి ఉండే ఫ్యాన్ బేసే వేరు. అత్యధిక డీఆర్పీ రేటింగ్ తో‌ దూసుకెళ్ళే సీరియల్ బ్రహ్మ ముడి. ఇది వెయ్యి ఎపిసోడ్ లు పూర్తిచేసుకుంది. గతంలో రాజ్ , కావ్య, అప్పు, కళ్యాణ్ ఉన్నప్పుడు ఈ సీరియల్ కి మంచి ఫ్యాన్ బేస్ ఉండేది. ఇప్పుడు నవతరం మొదలైంది. ఇందులో రాజు, ఇందుల జంట కనువిందు చేస్తుండగా విలన్ గా రేఖ ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఇక తాజా ఎపిసోడ్ లలో..రాజు కోపంగా ఇంట్లోకి వచ్చి రేఖను ఒక మూలకు పిలిచి నిలదీస్తాడు. DNA టెస్ట్ చేస్తే నీ అసలు రంగు బయటపడుతుందని బెదిరిస్తాడు. దీంతో రేఖ ముఖం పాలిపోయి చేతులు వణికిపోతాయి. రాజు బెదిరింపులతో భయపడిన రేఖ వెంటనే ఇందు దగ్గరికి, ఆ తర్వాత భ్రమరం దగ్గరికి వెళ్లి కాపాడమని బతిమాలుతుంది. కానీ ఇందు, భ్రమరం ఇద్దరూ తప్పు చేసిన వాళ్లకు శిక్ష తప్పదని, అబద్ధానికి సపోర్ట్ చేయలేమని క్లియర్ గా చెప్పేస్తారు. దీంతో రేఖకు ఎవరూ సపోర్ట్ లేరని అర్థమై ఒంటరిగా ఫీల్ అవుతుంది.

 

భ్రమరం చేతిలో ఉన్న కాగితాలు DNA రిపోర్టులేమోనని రేఖ కంగారుపడుతుంది. కానీ అవి శేషు లెక్కలని తెలిసి ఊపిరి పీల్చుకుంటుంది. అయితే రాజు మాత్రం నీ రిపోర్టులు లక్కీ దగ్గర పెట్టానని చెప్పి రేఖను ఆట పట్టిస్తాడు. రేఖ పరుగెత్తుకుంటూ వెళ్లి రిపోర్టులు చింపేస్తుంది. రిపోర్టులు చింపేసినా లాభం లేదని రాజు షాకిస్తాడు. ఇది సాఫ్ట్ కాపీ, నా మెయిల్ లో ఉంది, వంద జిరాక్స్ లు తీసి ఇంట్లో పంచుతానని అంటాడు. రేఖ భయంతో మెట్లపై కూర్చుంటే అపర్ణ వచ్చి కర్మ ఎవ్వరినీ వదిలిపెట్టదు, ఒకప్పుడు నువ్వు ఇందుని పరుగులు పెట్టించావ్, ఇప్పుడు నా మనవడు నిన్ను పరుగులు పెట్టిస్తున్నాడని గట్టిగా వార్నింగ్ ఇస్తుంది.

 

మరోవైపు రాజు, ఇందు కలిసి సుభాష్ ఆపరేషన్ రిపోర్టుల కోసం హాస్పిటల్ కు వెళ్తారు. డాక్టర్ గుడ్ న్యూస్ చెప్తాడు, నరాలకు ఎలాంటి సమస్య లేదు, ఆపరేషన్ చేస్తే బాగవుతారని, తర్వాత ఫిజియోథెరపీ అవసరమని చెప్తాడు. ఇందు మా తాతయ్య కోసం ఏమైనా చేస్తానని అంటుంది. ఇక ఇంట్లో ఐశ్వర్య గ్రాండ్ పార్టీ పేరుతో హంగామా మొదలుపెడుతుంది. సోమవారం ఎపిసోడ్ లో రేఖ రహస్యం బయటపడబోతుందా? రాజు నిజంగానే రేఖ DNA రిపోర్టులను అందరి ముందు బయటపెడతాడా? లక్కీ తన కొడుకే అని రేఖ ఒప్పుకుంటుందా? సుభాష్ ఆపరేషన్ కు ఇంట్లో అందరూ ఒప్పుకుంటారా? ఐశ్వర్య పార్టీతో మళ్లీ ఇంట్లో గొడవ మొదలవుతుందా అనేది తెలియాలంటే తర్వాతి ఎపిసోడ్ వరకు ఆగాల్సిందే.






Disclaimer:
All content included on this TeluguOne.com Portal including text, graphics, images, videos and audio clips, is the property of ObjectOne Information Systems Ltd. or our associates, and protected by copyright laws. The collection, arrangement and assembly of all content on this portal/ related channels is the exclusive property of ObjectOne Information Systems Ltd. or our associates and protected copyright laws.
You may not copy, reproduce, distribute, publish, display, perform, modify, create derivative works, transmit, or in any other way exploit any part of copyrighted material without permission from ObjectOne Information Systems Ltd or our associates.